ముంబై తీరం ఆవల ఉండే ఘారాపురి గ్రామంలో అరకొర వసతులు, అక్కడ పనిచేయడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు, ఇతర ఒడిదుడుకుల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను మైదానప్రాంతాలలోని పాఠశాలల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ దీవిలో ఉన్న ఒకే ఒక్క పాఠశాల ఈ నెల మూతపడబోతోంది.
శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని [email protected] ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు